best telugu jokes & Comedy Scenes

మంచి ప్లానింగ్
అప్పారావు: (ఆఫీసర్ తో) ఈమె నా భార్య సార్.....మంచి ప్లానింగ్ వుంది. ఇవాల్టి పనిని నిన్ననే చేసేస్తుంది.
సుబ్బారావు:(ఆఫీసర్) వెరీగుడ్............భోజనం చాలా బాగుందమ్మా.
అప్పారావు: వంట కూడా అంతే సార్. ఇవాళ మిమ్మల్ని పిలిచానని చెప్పగానే నిన్నే చేసేసింది.!
అరటిపండు
టీచర్: సోము! అరటిపండు గురించి చెప్పు?
సోము: తింటే బలపడతాం. తొక్కితే జారిపడతాం టీచర్.
ఏదైతేనేం!
అప్పారావు: ఇప్పుడు నాకు రోజూ కవిత్వం రాసే పనే!
సుబ్బారావు: వైద్యం చేయడం లేదా?
అప్పారావు: ఇప్పుడు అది మానేశా!
సుబ్బారావు: సరేలే ....................జనాన్ని చంపడానికి ఏదైతేనేం!
నాకు తెలియదు!
టీచర్: సోము! విద్యార్ధులు ఎక్కువగా ఉపయోగించే పదం ఏమిటి?
సోము: నాకు తెలియదు టీచర్!
టీచర్: వెరీగుడ్!
అదీ సంగతి!
అప్పారావు: ఈ పుస్తకంలో పాత్రల్ని పరిచయం చేసేసరికే సరిపోయింది . అసలు కథే లేదు! మరో పుస్తకమేదైనా ఇవ్వండి.
లైబ్రేరియన్: అదా సంగతి! టెలిఫోన్ డైరెక్టరీ ఎక్కడ పోయిందా అని తెగ వెతుకుతున్నా!
బైక్ నడపడం వచ్చాక
పోలీస్: ఏరా........ఈ సైకిల్ దొంగతనాలు ఎప్పుడు మానేస్తావ్?
దొంగ: బైక్ నడపడం వచ్చాక సార్!
కోపం
అప్పారావు :డాక్టర్! ఈ మధ్య ప్రతి చిన్న విషయానికీ కోపం వచ్చేస్తోందండీ..........
డాక్టర్: ఏంటీ.........మళ్లీ చెప్పు?
అప్పారావు: ఎన్ని సార్లు చెప్పాలి ........ఓ సారి చెబితే అర్థంకాదా? !
ఏకతాటి పై
టీచర్: సోము! స్కూలుకి తాడు తెచ్చావేంటి?
సోము: మీరే కదా సర్..............అందరం ఏకతాటిఫై నిలబడాలన్నారు? !
బ్యాంకనుకున్నా!
పోలీస్: ఎందుకురా.............జైలు గోడ తవ్వుతున్నావు?
దొంగ: సారీ సార్! నాకు చదువు రాదు. ఇది బ్యాంకనుకున్నా!
పళ్ళు తోమానంతే!
నాన్నా: బబ్లూ! నా బ్రష్ ఇలాగైపోయిందేం? ఏమన్నా చేశావా?
బబ్లూ: ఏం చేయలేదు నాన్నా! టామీకి (కుక్క) పళ్ళు తోమానంతే!
చూపించు?
డాక్టర్: కుక్క కరిచిందా? ఎక్కడో చూపించు?
రోగి: పొరుగూరి తీర్థంలోనండి. వస్తారా?
నవ్వుకోరూ!
స్వీటీ: నాన్నా! నా జోక్స్ పేపర్లో అచ్చయ్యాయి చూడు .
అప్పారావు: ఎంత పని చేశావే ఎవరైనా చూస్తే నవ్వుకోరూ!
కరిచిందా?
అమ్మ: తమ్ముడిని కుక్క కరిచిందా? వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళు.
స్వీటీ:ఆ కుక్క ఎప్పుడో పారిపోయిందమ్మా!
శుభ్రత
టీచర్: ఏంటి? పరీక్షలో ఖాళీ పేపరిచ్చిందిచాలక, 5 మార్కులు వస్తాయంటున్నావేంటి?
సోము: శుభ్రతకు 5 మార్కులన్నారుగా!
డబ్బే డబ్బు
చంటి పుట్టినరోజుకు వాళ్ల నాన్న స్నేహితుడు రవి డ్రమ్స్ బహుమతిగా ఇచ్చాడు.
నెలరోజుల తరవాత చంటి వాళ్ళింటికి వచ్చాడు రవి.
'ఏరా చంటి.....డ్రమ్స్ నచ్చాయా? నేర్చుకుంటున్నావా?' అడిగాడు రవి.
'ఆరోజు నాకు వచ్చిన బహుమతులన్నింటిలోకీ నాకు బాగా నచ్చింది అదే అంకుల్' హుషారుగా చెప్పాడు చంటి.
'ఎందుకని?'
'పొద్దున్నే దాన్ని వాయించకుండా ఉండటానికి నాకు అయిదు రూపాయలిస్తున్నారు నాన్న. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికొచ్చాక కూడా దాన్ని వాయించకుండా ఉండటానికి అమ్మ మరో రెండు రూపాయలిస్తోంది' చెప్పాడు చంటి.
రీచార్జ్ బెదిరింపు
అప్పారావు: సార్, ఫోన్ లో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.
పోలీస్: ఏమని?
అప్పారావు : రీచార్జ్ చేసుకోకపోతే కనెక్షన్ కట్ చేస్తామని.
తప్పిపోయింది
అప్పారావు : నేను చికాగో నుంచి తెచ్చిన కుక్కపిల్ల తప్పిపోయింది, పేపర్ లో ప్రకటన ఇవ్వాలనుకుంటున్నా!
సుబ్బారావు : మీ కుక్కకి పేపర్ చదవటం కూడా వచ్చా!
డ్రైవర్
అప్పారావు: నిదానంగా నడిపే డ్రైవర్ కావాలన్నావుగా? ఇదిగో ఇతడే.
సుబ్బారావు: అంత క్రితం ఏ బండి నడిపేవాడు?
అప్పారావు: రోడ్ రోలర్!
కంగ్రాట్స్ అండి!
టీచర్: (బంటి నాన్నాతో ) కంగ్రాట్సండీ! మీకు కొడుకు పుట్టాడటగా?
బంటి:నాన్నా: లేదే .....ఎవరు చెప్పారు?
టీచర్: మీ అబ్బాయే. తమ్ముడు పుట్టాడని నిన్న సెలవు తీసుకున్నాడుగా? !
T తరువాత?
టీచర్: ఒరేయ్ చంటి, T తరువాత ఏమొస్తుందిరా?
చంటి: బిస్కట్లు టీచర్.
ఎలా చెప్పగలవు!
అప్పారావు: మా వాడికి లెక్కలొచ్చు కానీ, జి.కె. లో మాత్రం పూర్.
సుబ్బారావు: ఎలా చెప్పగలవు?
అప్పారావు: 152/2, కాకినాడ అని అడ్రస్ రాయమంటే, 76 కాకినాడ అని రాసిచ్చాడు!
అయితే!
డ్రైవర్: సార్ కారులో పెట్రోలు అయిపోయింది సార్. అంగుళం కూడా ముందుకు పోదు.
అప్పారావు: అయితే వెనక్కి పోనీ.
పొగ
టీచర్: ఎప్పుడూ సిగరెట్లు కాలుస్తుంటే ఏమొస్తుందిరా?
నాని: పొగ వస్తుంది టీచర్.
ఎందుకు?
టీచర్: శిశుపాలుని తప్పులను వంద వరకే శ్రీ కృష్ణుడు ఎందుకు క్షమించాడ్రా?
చంటి: శ్రీ కృష్ణుడికి వంద వరకే అంకె లొచ్చు టీచర్.
ఆ రెండు!
నాన్నా: ఏరా లెక్కల్లో మార్కులు వందకు ఫైనే వచ్చాయన్నావు? మరి రెండు మార్కులు వచ్చాయి ఏంటిరా?
చింటు : అవును నాన్నా! ఆ రెండు ఎక్కడ వేశారో చూడు. వందకు ఫైనే కదా!
అసాధ్యం

చంటి: 'అసాధ్యం' అనే పదం అసలు నా డిక్షనరీ లోనే లేదు.

బంటి: ఇప్పుడు చెబితే ఏం లాభం. డిక్షనరీ కొనేప్పుడే చూసుకొని ఉండాల్సింది....!

అవుతావనే!
కొడుకు: నాన్నా! నాకు నూటికి నూరు మార్కులొస్తే ఏం చేస్తావు?
నాన్నా: అబ్బో! మూర్చపోతా.
కొడుకు: అలా అవుతావనే ముప్పై తెచ్చుకున్నా నాన్నా!
చెప్పానా!
అమ్మ: ఏరా! అన్నదమ్ములు ఇచ్చిపుచ్చుకోవాలని చెప్పానా? కొట్టుకుంటారేం?
పెద్దకొడుకు: మేమూ ఇచ్చిపుచ్చుకుంటున్నాం. నేనొక దెబ్బ ఇస్తే , వాడు ఒకటిచ్చాడు!
నా అంత అయ్యాక!
టీచర్: నా అంత అయ్యాక ఏం చేస్తావు రాధ?
రాధ: సన్నబడడానికి ప్రయత్నిస్తాను మేడం!
అందుకే!
డాడి: ఎందుకు ఏడుస్తున్నావ్?
చంటి: మమ్మీ! అరటి పండు మీద కాలేసి జారింది.
డాడి: మమ్మీ పడితే నువ్వెందుకు ఏడవడం?
చంటి: పడినప్పుడు చూసి నవ్వానని అమ్మ కొట్టింది. అందుకే!

0
No votes yet