మనసారా నవ్వుకుందాం రా - 5 !

1.“ఏయ్ ! హేండ్సప్ ! చేతులు పైకెత్తి స్ట్రైట్ గా నిలబడు, అసలు కదలొద్దు. లేకపొతే షూట్ చేసెస్తాను” రివాల్వర్ చూపిస్తూ అరిచాడు బందిపోటు దొంగ భీమారావు.

“ చేతులు నొప్పిగా వున్నాయి ,అస్సలు పైకెత్తలేను, ఏం చేస్తావో చేసుకో? “ ఆసక్తిగా అన్నాడు రాజారావు

“ చెప్పిన విధం గా చెసి నన్ను కన్ ఫ్యూజ్ చెయ్యకుండా కాస్త కోపరేట్ చెయ్యవయ్యా బాబూ ! నాకసలే ఈ వృత్తి కొత్త. నీలాంటి పెద్ద మనుష్యులు కాస్త సహాయం చెసి నాకు కాంఫిడెన్స్ ఇవ్వాలి లేకపోతే ఈ వృత్తిలో రాణించలేను” అసలు సంగతి చెప్పాడు భీమారావు.

2.“ ఆ దొంగ బస్సులో అంత రష్ లో నీ జాకెట్లో చెయ్యి పెట్టి పర్సు కొట్టెస్తుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావే ? గట్టిగా కేకలు పెట్టి వాడిని పట్టించక పొయ్యావా ?” ఆశ్చర్యం గా అడిగింది రేఖ

“ ఆ దొంగ వెధవ జాకెట్లో చెయ్యి పెట్టింది పర్సు కోసమని నేను అనుకోలేదు, అందులే అరవలేదు” అసలు సంగతి ఐస్ క్రీం తింటూ తాపీగా చెప్పింది సృజన.

0
No votes yet