మనసారా నవ్వుకుందాం రా ! - 2

(1)ఎందుకే ఈ పచ్చడి బండను షో కేసులో పెట్టావు ? ఏమిటి దాని ప్రత్యేకత ? " అడిగింది రాజి.

" నేను కాపురానికి వచ్చిన వారం రోజుల లోనే ఈ పచ్చడి బండకు గుద్దుకొని పడిపోయే మా అత్తగారు టపా కట్టేసింది.నాకు అత్త పోరు లేకుండా చేసింది. అందుకే ఈ పచ్చడి బండ అంటే నాకెంతో ఇష్టం. దానిని అపురూపం గా దాచుకున్నాను." గర్వం గా చెప్పింది రేఖ.

(2)" ఈ ఆపరేషన్ థియేటర్లో పూల దండ ఎందుకు పెట్టారు సార్ ?" ఆదుర్దాగా అడిగాడు చిన్నారావు.

" ప్రాక్టీస్ మొదలెట్టిన దగర్నుంచీ నేను చేస్తున్న మొదటి ఆపరేషను ఇది.సక్సెస్ అయితే దేవుడికి వేస్తాం. ఫెయిలయితే నీకు వేస్తాం" తాపీగా కళ్ళజోడు సవరించుకుంటూ అన్నాడు డాక్టర్ దైవాధీనం.

0
No votes yet