మనసారా నవ్వుకుందాం రా ! – 4

1."ఇదివరకు వస పిట్టలా గడ గడ వాగుతుందే వాడివి. ఇప్పుడేమిటి సైలెంట్ గా వుంటున్నావు ?" ఆశ్చర్యంగా అడిగాడు వెంగళ్రావు.
" ఈ మధ్యనే బొలెడు కట్నం తీసుకొని పెళ్ళి చేసుకున్నాను. ఇంక పెళ్ళాం ముందు నోరు విప్పడం కూడానా నా బ్రతుకుకి ? అసలు సంగతి విచారం గా చెప్పాడు తాతారావు.

2."ఈ మధ్య మన చంటాడికి అన్ని మీ బుద్ధులే వస్తున్నాయండీ " అంది మంగ
"ఏం చేస్తున్నాడు ?" ఆశ్చర్యంగా అడిగాడు గవర్నమెంట్ ఉద్యోగి అయిన అప్పారావు.
" లంచం ఇవ్వందే ఏ పని ఆఖరుకి భోజనం కూడా ఫ్రీ గా చెయ్యడం లేదు.పగటి పుట స్కూలులో బెంచీ ముందు కూర్చోని హాయిగా పడుకుంటునాడట. మాస్టారు ఏం అడిగినా తెలీదు తెలీదు అని విసుక్కుంటున్నాడట.ప్రోగ్రెస్ రిపోర్ట్ పై దొంగ సంతకాలు కూడా పెడుతున్నాదట " అసలు సంగతి చెప్పింది మంగ.

0
No votes yet