మనసారా నవ్వుకుందాం రా!

1. “మా ఇంటికి చుట్టాలు ఎవరొచ్చినా సరే రెండు రోజులకు మించి వుండరు తెలుసా ?” గర్వంగా భుజాలెగరేసుకొని అన్నాడు పాపారావు

“అరే. అలా ఎలా మానేజ్ చేయగలుగుతున్నావురా ? నాకు కూడా కొంచెం చెప్పు. చుట్టాల తాకిడితో చచ్చిపోతున్నాం “ అడిగాడు అప్పుల అప్పారావు.

“ చుట్టాలొచ్చిన దగ్గర నుండీ కాఫీ, టిఫిన్ల తొ పాటు వంట కూడా మా ఆవిడ చేత వండిస్తాను. అంతే ఆమె చేతి వంటకు తట్టుకోలేక రెండు రోజులకే అందరూ పరార్ !” అసలు సంగతి చెప్పాడు పాపారావు.

2. “ఇప్పటికే మీ చూపు చాలా మందగించింది. వెంటనే గుట్కా తినడం మానక పోతే చూపు వెంటనే పోయే ప్రమాదం వుంది. జాగ్రత్త “ కోపంగా అన్నాడు డాక్టర్ దైవాధీనం

“డాక్టర్ గారు. నేను వయసు మళ్ళిన వాడిని. చూడవల్సిన విషయాలన్నింటినీ ఇప్పటికే చేసేసాను. ఇప్పుడు కొత్తగా చూపు పోతే మాత్రం వచ్చే నష్టం ఏముంది గనుక “ నిట్టూరుస్తూ జేబు లో నుండి గుట్కా పాకెట్టు తీసి నొట్లో వేసుకున్నాడు వెంకటాచలం.

0
No votes yet